Sunday, September 27, 2020


































 27-09-2020

పాత తెలుపు,నలుపు ఫోటో లు కలర్ లోకి మార్చాను.అవి కొన్ని పైన మొదట్లో ఉన్నాయి.

మార్చ్ 4 న బయలుదేరి కడప జిల్లా లో జమ్మలమడుగు దగ్గరగల గండికోట వెళ్ళాము .రాధ,రత్నమాల, రామక్రిష్ణ,నేను.

నిజంగా కోట ఇప్పటికీ చాలామటుకు చెక్కు చెదరకుండా ఉన్నది పెన్నా నది ఇక్కడ కొండల మధ్య ఎక్కడో లోతులో ప్రవహిస్తుంటుంది.దాన్ని గండి అంటారు .అందుచేత ఆ కోటను గండికోట అంటారు.పెమ్మసాని వారు ఈ రాజ్యాన్ని ౩౦౦ ఏళ్ళు పాలించారు.విజయనగరానికి సామంతులుగానూ,తర్వాత స్వతంత్రులుగానూ .చివరి రాజు పెమ్మసాని చిన తిమ్మా నాయుడుని,అతని మంత్రి విషం  పెట్టి చంపి,కోటను ముసల్మాన్లకు అప్పగించాడు ట.అక్కడనుండి కమ్మవారు 76 ఇంటిపేర్లు కలవారు,తమ తమ ధనరాసులను గంపలకెత్తుకుని దక్షిణాదికి తరలిపోయ్యరుట .వీళ్ళని గండికోట కమ్మవారు,లేక గంపకమ్మవారు అని పిలుస్తారు.బుర్రిపాలెంలో నేను పనిచేసినప్పుడు,ఈ విశయం నాకు తెలీదు.బుర్రిపాలెంలో అంటా గండికోట కమ్మవారే.పెమ్మసాని,నర్రావుల,శాకమూరి,అడుసుమిల్లి,ఘట్టమనేని .ఊరంతా వీళ్ళే .

పెమ్మసాని రామలింగానాయకుడు,శ్రీకృష్ణ దేవరాయులు వద్దా ప్రధాన సైన్యాయధిపతి గా పని చేసాడు.గండిపేట లోని దేవాలయాలు,తాడిపత్రిలో గల దేవాలయాలు పెమ్మసానివారు నిర్మించినవే.వాటిలో శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది.

Friday, May 24, 2019


       2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మే 23 న వెలువడ్డాయి .

ఊహించని ఫలితాలు వచ్చాయి.
టీడీపీ  - 23
జనసేన - 1
వైసీపీ  - 151.

ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.టీడీపీ అంత  హీనమయిన స్థితి లో ఉన్నాడని ఎవరూ అనుకోలేదు.
చంద్రబాబు పాలన పట్ల ప్రజలు అంత అసంతృప్తితో ఉన్నారని అనుకోడానికి ఆధారం లేదు.వోటింగ్ రోజున అర్ధరాత్రి వరకు ఉండి ఓటేసిన మహిళలు టీడీపీ వ్యతిరేకంగా వోటువేశారని అనుకోలేము.
ఈవీఎం లో మానిప్యులేషన్ ఉన్నదా అనే అనుమానం వస్తోంది.ఏది ఏమైనా 5ఏళ్ళు టీడీపీ పరిస్తతి ఆగామిగోచరం.
గతంలో పది ఏళ్లపాటు అధికారానికి ఎడంగా వున్నా చంద్రబాబు పార్టీ ని నిలబెట్టగలిగాడు.ఇప్పుడు ఆయనికి వయసు పెరిగింది. పార్టీని కాపాడుకోగలడా అనే విషయంలో సందేహాలున్నా  వేచి చూడాలి.
జనసేనలో పొత్తు పెట్టుకున్నట్లయితే చంద్రబాబే మళ్ళీ అధికారంలోకి వచ్చివుండేవాడు.ఫలితాల సరళి అదే
చెబుతోంది.నాకు అర్ధం అయినది ఏమంటే పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ స్వంతంగా అధికారంలోకి  రావడం.అసాధ్యం అని.

Tuesday, May 14, 2019


కూచిపూడి కళా  క్షేత్రము వద్ద 

Friday, December 22, 2017

దినచర్య.
23 డిసెంబర్ 2017.
       నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మాల్ దీవులనుండి వచ్చారు.
ఆయన విశ్రాంతి నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి 18 డిసెంబర్ 2017 న మాల్ దీవులు వెళ్ళారు.
ఆయనకి విశ్రాంతి చాలా అవసరం.రోజుకు 18 గంటలుపని జేసే ముఖ్యమంత్రి దేశంలో ఈయన ఒక్కడే.
ఈ రోజు ఆయన గుంటూరులో జరిగే కిస్మస్ వేడుకలకు హాజరవుతారు.
       23,24,25 తేదీలలో PWD గ్రౌండ్స్ లో గులాబీ పుష్పాల ప్రదర్సన జరుగుతుందట.
బయటికి వెళ్ళాలంటే బాగా ఇబ్బందిగా వున్నది.కాస్త బద్ధకం. రెండు స్కూటర్ మీద వెళ్లగలమా అనే భయం .
       ప్రొద్దుటే దుర్వార్త.మాతోపాటు పార్క్ కి వచ్చే శంకరరావు గారు పోయారుట .ఆయనకీ 92 ఏళ్ళు.
రెండు నెలలనుండి పార్క్ కి రావడంలేదు అనారోగ్యం వలన .ఎక్కువ కాలం మంచం మీద లేకుండానే వెళ్ళిపోయాడు.అదృష్టవంతుడు. చీఫ్ ఇంజనీర్ చేశాడుట .చంద్రబాబు అంటే గిట్టదు. వోటు మాత్రం తెలుగుదేశానికే వేస్తాడుట.సుంకర సుబ్బారావు గారు చెప్పాడు. ఎప్పుడో .
     రెండు రోజులనుండి రాధ అక్కగారు వచ్చి వున్నారు .కొంచెం ఫ్రీగా మసలడానికి ఇబ్బందిగా వున్నది.

     పోలవరం ప్రాజెక్ట్ చూసి మాట్లాడటానికి ,గడ్కారి గారి OSD,PPA సభ్యుడు ఒకాయన వచ్చి రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపారు. గడ్కారి ఎప్పుడు వస్తాడో.
24 డిసెంబర్ 2017.
     ప్రొద్దుటే మంచంమీదనుండి లేవకముందే గోపిచంద్ ఫోన్ .వాళ్ళ మామగారు రాత్రి పొయ్యారని.9 గంటలకు అద్దె కారు తీసుకుని రాధ,నేను ఇద్దరం వెళ్ళాము. ఆమె వస్తుందని నేను అనుకోలా .ఇంటి కొచ్చేసరికి 1 గంట అయ్యింది.
మైల స్నానం జేసి అప్పుడు వంట జేసుకుని తిన్నాం.సాయంకాలం చిన్న కర్మ అని ప్రసాద్, అంటే చనిపోయిన మా వియ్యంకుడు మన్నవ సాంబశివరావు గారి అబ్బాయి ఫోన్ జేశాడు.మరల వచ్చే ఓపిక లేదని చెప్పాను. పెద్ద కర్మకు ఎలాగూ వెళ్ళాలి.
        రామారావు ఇచ్చిన "రేమి మార్టిన్" షాంపెన్ కోజ్ఞాక్  తీసుకుంటే ఏవిటో అదో రకంగా వున్నది. నెట్ లో చూసా ఇది తాగాలంటే చాలా తతంగం వున్నది.మామూలుగా కాస్త సోడానో,నీళ్ళో కలుపుకు తాగేది కాదు.
          గ్లాస్ లో పోసుకుని కొంచెం గిర గిరా తిప్పి మధ్యలో కాస్త వాసన జూసి, కాస్త కాస్త చప్పరించాలి.ఇది చాలా ఖరీదు డ్రింక్.
  RK నగర్ ఉపఎన్నికలో దినకర్ కి ఘనవిజయం వచ్చింది. 40 వేల వోట్ల మెజారిటీ వచ్చింది అన్న డిఎంకె కంటే.
మళ్ళీ అందరూ కలుస్తారనుకుంటా. మోడీ తమిళ రాజకీయాలలో జోక్యం చేసుకోడాన్ని తమిళ్ ప్రజలు అంగీకరించలేదు అనడానికి,ఈ భారీ మెజారిటీ తార్కాణం.
   పార్క్ లో  ఈ రోజు శంకరరావు గారి ఆత్మ శాంతికి ఒక నిమిషం మౌనం పాటించారు.
25డిసెంబెర్ 2017.
క్రిస్మస్ పండుగ .ఈ రోజు చంద్రబాబు గారూ బెంజ్ సర్కిల్ లో వున్నా కేతేద్రల్ లో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.
సాయంత్రం పార్క్ లో వాసు తో ఘర్షణ పడటం జరిగింది.అన్నిటికీ ఆయన చెప్పిందే గొప్ప అంటాడు.ఇక అసలు అతనితో మాట్లాడనే కూడాడు.అనవసరమైన  గోల.
26 డిసెంబర్ 2017.
ఈ రోజు ఒన్ టౌన్ కి వెళ్లాను ,సుంకర సుబ్బారావు గారితో కలిసి. మొత్తం 3వేలదాకా అయ్యింది డ్రై ఫ్రూట్స్ బిల్లు.
బ్లూటూత్డిసెంబర్ 2017. త్రాన్స్మీతర్ ,హెడ్ ఫోన్స్ అన్నీ వచ్చాయి Paring కుదరడంలేదు.శ్రీనివాస్ ని రమ్మన్నాను.రేపు వస్తానన్నాడు.పార్క్ కి ఎక్కువమంది రాలేదు..రేపు రాష్ట్రపతి గారి పర్యటన రాజధాని అమరావతి లో..
27 డిసెంబర్2017.
ఊరికినే కూర్చోడం విసుగ్గా వున్నది.2018 నుండి ఏదన్నా చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలు చేస్తే బాగున్తదనుకుంటున్నా.అట్లాగే M.A  History చేస్తే బాగుంటదేమో .కొంత వ్యాపకం.
మే 15 2019
పార్క్ కి వచ్చే వాసు క్యాన్సర్తో పోయాడు.పాపం ముందు భార్య పోయింది.తర్వాత ఈయన.
లీల ఫోను ఇవ్వాళ .కృష్ణారావు ది  ఏడూరు ఈ నెల 20 న.

29 సెప్టెంబర్ 2020

ఇవ్వాళ  మోహిత్ కృష్ణ 23 వ పుట్టినరోజు.మా కుటుంబం లో ఒక్క గోపీచంద్ తప్ప పిల్లలంతా సెప్టెంబర్ లోనే పుట్టారు.ఎవ్వరూ సుఖంగాలేరు మా అమ్మాయి రత్నమాల ,భర్తను పోగొట్టుకున్నది. ప్రేమ్ చంద్ కాపురం చట్టుబండ లయ్యింది.రామకృష్ణ (కుమార్తె కుమారుడు),మాకు మనవడు పనికిమాలిన వాడు అయినాడు.ఇక గోపీచంద్ కొడుకు మోహిత్ కృష్ణ రెండవ ఏడు ఇంజనీరింగ్ చదువుతూ రోడ్ అక్సిడెంట్లో చనిపొయ్యాడు.నా కుటుంబం సర్వ నాశనం అయిపొయింది.రామ కృష్ణ కి కాస్త కనువిప్పు కలిగి సంపాదించుకోవాలనే కోరిక కలిగితే అదృష్టం అనుకోవాలి.కంప్యూటర్స్ వాడటంలో అతనికి విశేష ప్రజ్ఞా ఉన్నది.అది ఉపయోగించుకుని బాగుపడాలన్న కోరిక అతనికి ఇప్పటివరకు లేదు.
పార్క్ ఎప్పుడు తెలుస్తారో మరి.సాయంకాలం కాసేపు పార్క్ లో కూచుంటే బాగుంటుంది.
సాయంత్రం రాజేశ్వరి,మాధవి,సుంకర శ్రీనివాస్ వచ్చి కాసేపు కూచుని వెళ్ళారు.
రేపో ఎల్లుండో హొమియో డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాలి.వెర్టిగోకి ఆయన ఇచ్చిన మందు బాగానే పని చేసింది.
30సెప్టెంబర్ 2020
ప్రొద్దుటే వెళ్లి ATMలో పదివేలు తెచ్చా.
బాబ్రి మసీదు కూల్చివేతపై సిబిఐ కోర్ట్ తీర్పు వచ్చింది.అందరినీ వదిలేసారు.
అద్వాని గారు బయట పడ్డారు.కనీసం ఈ సారి రాష్ట్రపతి ని చేస్తే బాగుంటుంది.  ఇవ్వాళ ధైర్యం జేసి మంగలి షాప్ లో క్రాప్ చేయించా.కొత్త గుడ్డ కప్పాడు.బాగానే చేసాడు 80 రు మాత్రమె తీసుకున్నాడు.ఇంటికొచ్చి తల స్నానంచేసా .
అన్నం తిన్న తర్వాత మంచి నిద్రపట్టింది.
రేపు ఒకటో తారీకు పెన్షన్ ఎప్పుడు వేస్తారో.
1 అక్టోబర్ 2020
అబ్బో పెన్షన్ వేసేసారు. ఎన్నాళ్ళకో. 
ఉదయం హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళామందులు ఇచ్చాడుగాని ఖరీదే తడవకి 450 అంటే నెలకు 900.
సరుకులు బిల్లు 2325 .అయినవి.కరెంట్ బిల్లు ఎంతవస్తాదో?రాధకి డ్రై ఫ్రూట్ లడ్డు అరకేజీ తెచ్చా ౩౦౦ అయ్యింది
అరటిపళ్ళు 50 .కొబ్బరి బొండాలు 600.ఒక్కోటి 30 చొప్పున.20 కాయలు .మంగలి షాప్ కి 80 రు .
2 అక్టోబర్ 2020 
గాంధీ జయంతి.అలాగే లాల్ బహదూర్ శాస్త్రి  జయంతి.
"గాంధి మళ్ళీ పుట్టాడని సాక్షి పత్రికలో వ్యాసం రాసుకున్నారు.ఏడవాలో నవ్వాలో తెలీడం లేదు ,జగన్ కి గాంధికి పోలికా .
ABN లో డిబేట్ పార్టిలు -సిద్ధాంతాలు.నవ్వొస్తుంది.ఏ పార్టీకి సిద్ధాంతాలున్నాయి.అసలు సిద్దాన్తాలేమిటి?ప్రజల మేలు కోసం పనిచేసే పార్టీ కావాలిగాని.
9631 icici క్రెడిట్ కార్డు కట్టాను. 
3 అక్టోబర్ 2020 
ఈ రోజు శేషగిరిరావు గారిని పలకరించడానికని,సుబ్బారావు గారితో కలిసి వారి ఇంటికి వెళ్ళాను.దాదాపు రెండు గంటలు ఉన్నాము.ఇక బైటికి వేళ్ళలా.సాయంత్రం రాధకి ఇన్సులిన్ ఇంకా మందులు కొనడానికి మెడ్ ప్లస్ కి వెళ్ళా .రేపు తెప్పించి ఇస్తానని అక్కడుండే ఫర్మసిస్ట్ చెప్పింది. రాధ హొమియో డాక్టర్ వద్దకు వెళ్ళింది. నిన్న ప్రేమ్చంద్ కూడా చుపించుకున్నాడుట .700 ఖర్చు.పనిమనిషికి 11౦౦ జీతం ఇచ్చాము.
జగన్ మామ గంగిరెడ్డి చనిపోయాడుట. వివేక హత్యలో ఒక గట్టి సాక్షి పొయ్యాడు.పోయ్యాడో పంపించేసారో.
4 అక్టోబర్ 2020
ఆదివారం.అమెరికా అధ్యక్షుడికి ,భార్యకి కరోన.విశాఖపట్నం ద్రోణంరాజు సత్యనారాయణ కి కరోనా వాళ్ళ మరణం.
నిన్న విశాఖలో సబ్బం హరి ఇంటి ప్రహరీగోడ కూలగొట్టారు .ఇవ్వాళా బెజవాడలో పట్టాభి కారు అద్దాలు పగలగొట్టారు ' మరీ రౌడి రాజ్యం అయిపొయింది. మంత్రులు బూతులు మాట్లాడడం ఇప్పుడే చూస్తున్నాం.ఈ రాష్ట్రం ఎటు పోతుందో.మేడ్ప్లుస్ లో రాధకి 4ఇన్సులిన్ బాటిల్స్ ,4గ్యాస్ కి ఉపయోగపడే లిక్విడ్ 4 బాటిల్స్ కొని సబి క్రెడిట్ కార్డు మీద 896 పే చేసాను.
5అక్టోబర్ 2020 సోమవారం.
ప్రొద్దుట 7 గం లకు బ్లడ్ టెస్ట్కి వెళ్ళాము.అన్ని రకాలకి కలిపి బిల్లు 32౦౦.చాలా ఎక్కువనుకుంటా.
మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిన్నాక వెళ్ళాము.నాకు ఫస్తింగ్ 186,తిన్నతర్వాత 300 ఉన్నది .రేపటినుండి నడవాలి తప్పదు.విష్ణు ఫోన్ చేసాడు .ఆధార కార్డులు pvc కార్డ్ లు 50 రు కడితే ఇస్తారుట. నాది,ప్రేమ్చంద్ డి చేసాను.రేపు విష్ణు గారికి చెయ్యాలి.మెడ్ ప్లస్ లో తలనొప్పికి,వేర్టిగోకి స్తుజిరాన్ ,జలుబుకి ,amoxicilin clv 650 tablets కొన్న .
560 రు అయ్యింది.రాత్రి ఈ తలనొప్పితో నిద్ర కూడా సరీగా పోలేదు .మైగ్రిన్ వాడే టాబ్లెట్స్ తగ్గితే పరవాలేదు లేనట్లయితే న్యురాలజిస్త్ని చూడాలేమో.
6 అక్టోబర్ 2020 మంగళవారం 
 ప్రొద్దుట  6 గ లకు నడుచుకుంటూ వెళ్లి రిపోర్ట్స్ తెచ్చా .లక్ష్మి దగ్గర కూరగాయలు 120 రు.బొప్పాయి 20రు,జామకాయలు ౩౦ రు ఖర్చుపెట్టా .ప్రేమ చాంద్ తో ఒక పదివేలు తెప్పించా.పాలకి icic నుండి 2272 పంపించా.
కరెంటు బిల్లు 3490 పే చేశా sbi నుండి.
సాయంత్రం అయుష్ లో nuerologist శైలజ గారి దగ్గరకు వెళ్ళా త్తలనోప్పి గురించి consultetion 600.మందులు 60 రు.ఒక వారం వాడి మళ్ళీ రమ్మంది.
7అక్టోబర్2020,భుధవారం 
రాత్రి ఒక మాదిరిగా నిద్రపట్టింది .తలనొప్పి రాలేదు తెల్లవారేకా కొంచెం మగత,నిలబడ్డప్పుడు తల బరువు అనిపించడం తగ్గలేదు.బహుసా ముందు ముందు ఫలితం ఉంటుందేమో .రెండు జతలు స్లిప్పేర్స్ కొన్నా ఒకటి 800.
రెండోది 300.ఇది అక్యుప్రేజర్ గా పని చేస్తుంద
8 అక్టోబర్ 2020 గురువారం.
 ఈ రోజు ప్రొద్దున తలనొప్పి అనిపించి,డాక్టర్ వ్రాసిన రెండో రకం బిళ్ళ వేసుకున్నా.బాగా నిద్రపట్టింది. లేచినతర్వాత
 తల బరువు కొంచెం తగ్గినట్టు అనిపించింది .కూరగాయలు 140.బొప్పాయి 20,బత్తాయిలు 12 80.
ఇప్పుడే రాత్రి ఏడుగంటలకు అప్పారావు బాబాయి గారి అమ్మాయి బేబీ చనిపోయినదని రవీంద్ర చెప్పాడు.
నేనేమో హైదరాబాద్ వెళ్ళలేను.బాధ పడటం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు.
9 అక్టోబర్ 2020, శుక్రవారం
 రత్నమాల హైదరాబాద్ లో ఉన్నందున ఆమెకు ఫోన్ చేశా వీలయితే బేబీ కూతల్లని పలకరించి రమ్మని.సాయంత్రం అంటా ఒకటే వర్షం రెండు రాష్ట్రాల్లో.నేను ఉదయం రాధికకు ఫోన్ చేసి పలకరించా.
ప్రేమ చంద్ స్కూటర్ ఖర్చు 17వేలు. ఇతనితో చాల ఇబ్బందిగా ఉన్నది.sbi క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశా 16053 రు.
ఆపిల్స్ 110 రు'
10 అక్టోబర్ 2020,శనివారం
మన్నే శ్రిన్వాసరావు గారు వ్రాసిన రేపల్లె చరిత్ర పుస్తకం వచ్చింది .పెద్ద బౌండ్ .చాలా విషయసేకరణ చేసి కస్టపడి వ్రాసారు.వారపత్రిక 30.కార్పెంటర్ వచ్చి కొలతలిఇచ్చాడు సోమవారం పోయి తేవాలి ప్లీవుడ్
11 అక్టోబర్ 2020 ఆదివారం
 అమరావతి ఉద్యమం 299 వరోజు .రాజధాని గ్రామాలలో భారీ పాదయాత్ర జరిగింది.ప్రజలు ముఖ్యంగా మహిళలు 
భారీగా పాల్గొన్నారు .రాస్ర మంతా కూడా అన్ని  చోట్ల నిరసన్ ప్రదర్సనలు జరిగాయి.
హై కోర్ట్ జడ్జీలమీద ,సుప్రీం కోర్ట్ జడ్జ్ NV రమణ మీద జగన్ CJI కి కంప్లయింట్ చేస్తూ ఉత్తరం రాస్సాడు .
ఒక ముఖ్యమంత్రి,ఒక సుప్రీం కోర్ట్ జుద్జ్ మీద కంప్లయింట్ అంటే ఇంతకూ ముందు ఎప్పుడూ జరగలేదు.
ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
12 అక్టోబర్  2020 సోమవారం
 ఈరోజు వెళ్లి లమినటేడ్ చెక్కలు తెచ్చాము .మొత్తం 17౦౦ అయ్యింది కార్పెంటర్ రేపు సాయంత్రం వస్తానన్నాడు.
 లోకేష్ ఇవ్వాళ అమరావతి గ్రామాలో ప్రసంగించి,రైతులకు మద్దతు తెలిపాడు.పర్యటన ఆసాంతం బాగా జరిగింది.ఎక్కడా తడబాటు లేకుండా ప్రసంగాలు చేసాడు.గోధుమ పిండి మందు బిళ్ళలు 200.
హాయ్కోర్ట్ న్యాయమూర్తులమీద వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసినవారి కేసు సిబిఐ కి అప్పగించింది.కోర్ట్..జగన్ కేసు హైదరాబాద్ రేపటికి వాయిదాపడింది.
13 అక్టోబర్ 2020 మంగళవారం
పోద్దుతనుంది ధారాపాతంగా వర్షం.మా బ్లాక్ లో కరెంట్ లేదు.రాత్రి 8కి ఇచ్చారు.సాయంత్రం డాక్టర్ శైలజ గారి వద్దకు వెళ్ళా అవే మందులు ఇంకో 15 రోజులు వాడమన్నారు.BP యెన్దుకనొ 178 ఉన్నది .బహుసా జలుబు వల్లనేమో.జలుబు కాస్త తగ్గింది.మందులు 40 రు.
జగన్ రాసిన కంప్లయింట్ మీద ఢిల్లీ నుండి ఏమీ చప్పుడు లేదు.నేననుకోడం రమణకి ఏమీ కాదని.జగన్ ఇబ్బందుల్లో పడతాడని.చూడాలి జాతీయపత్రికలన్నీ జగన్ ను విమర్శిస్తున్నాయి. 
14 అక్టోబర్ 2020 
 ఇవ్వాళా బిపి మిషన్  కొన్నా 2000.మధ్యాహ్నం 141 ఉన్నది సాయంత్రం 7 కి 161 ఉన్నది.ప్రోద్దున్నేనడక అవసరం .బద్ధకించకుండా వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి.ప్రేమ్చంద్ మందులు 15౦౦ అయ్యాయి.
ఒకసారి విజయ్ చితన్య ని కలిస్తే మంచిది,రేపు హొమిఒ రామకృష్ణ ని కలవాలి.
వర్షాలకి హైదరాబాద్ అతలా కుతలం అయ్యింది.కూరగాయలు 220. 


Monday, February 27, 2017

నా జ్ఞాపకాలు.


                                              అనామకుని ఆత్మకథ         
                                          బాలగంగాధర రావు మండవ    
                                   నాకు బాగా జ్ఞాపకం వున్నది 1949 నుండి అనుకుంటాను. నాకు ఉహ తెలిసేనాటికి  మా కుటుంబం  రేపల్లె లో ఉన్నది. నేను చాలాకాలం మా స్వంత ఊరు రేపల్లె అనుకునేవాణ్ణి. కాని తర్వాత తెలిసింది, మా స్వంత ఊరు గొరికపూడి అని. నా బాల్యం అంతా రేపల్లె లోనే గడిచింది.  1942 లో నా తల్లితండ్రుల వివాహం జరిగితే ,నేను 1943 లో జన్మించాను.నా మాతామహుల వూరు దుగ్గిరాల దగ్గిర మంచికలపూడి.నేను అక్కడే జన్మించాను. మా అమ్మమ్మ, మా తండ్రి గారికి మేనత్త అవుతుంది. నాకు వుహ తెలిసేనాటికి నా మాతామహులు కూడా రేపల్లె లోనే స్థిర  నివాసం  ఏర్పరుచుకున్నారు.
                    నేను పుట్టింది 1943  డిసెంబర్ 2 అయితే మా తాతయ్య నన్నుహై స్కూల్లో చేర్చేటప్పుడు వయసు చాలలేదని ఒక సంవత్సరం ఎక్కువ వేసారు. ఆ రకంగా నా పుట్టిన తేది డిసెంబర్,2,  1942 అయ్యింది.
నా ప్రాధమిక విద్య ఆంతా ప్రైవేటు  ఉపాధ్యాయుల వద్దే జరిగింది. మా ఇళ్ళ వద్దే ఎవరో ఒకరింట్లో ఈ బడి జరిగేది..నాకు ఆక్షరాభ్యాసం చేసిన పంతులుగారు నేను విజయవాడ లో బిఎస్సీ చదవుతున్నప్పుడు కూడా మాఇంటికి విజయవాడ వచ్చేవారు. ఆయన తరువాత, 5 వ తరగతి వరకునాగేంద్రంగారని ఒక మాస్టర గారి దగ్గర చదువుకున్నాను. నా ప్రాధమిక విద్య స్థాయి లో  నాకు మంచి పునాది పడలేదని నాకు ఒక అభిప్రాయం వున్నది. నేను చదివిన ప్రైవేటు పంతులుగార్లకు  చదువు చెప్పే సామర్ధ్యం ఉన్నదని నేను అనుకోను.  వాళ్ళెవరు యసేఎస్యల్సి కూడా పాస్ అయినవాళ్ళుకాదు. 

ఇసుకపల్లి వెళ్ళే రోడ్డు లో అప్పట్లో మూడు పెద్ద వడ్లమిల్లులు ఉండేవి.రైల్వేస్టేషన్ నుండి ఇసుకపల్లి వెళుతుంటే
కుడివైపున ఉండేవి. అందులో మొదటిదానికి ఎదురుగా ఒక చిన్న చెరువు ,దాని తర్వాత యన్.జి.రంగా బొమ్మా, దాని ప్రక్కగా లోపలికి ఒక దారి వున్నాయి. ఈ దారికి ఎడమవైపున మా తాత గారిల్లు  వుండేది. నాలుగు నిట్టాళ్ళ పూరిల్లు. చుట్టూ మట్టిగోడలు ఉండేవి.
నా బాల్యం అంతా ఈ ఇంట్లోనే గడిచింది.ఆ ఇంట్లో మా తాత, నాయనమ్మ,నా మేనత్తలు ఇద్దరు, మా బాబాయి. నేను వుండేవాళ్ళం. మా పెద్ద మేనత్తకు అప్పటికే వివాహమయ్యింది. మా పెద్ద అమ్మమ్మ కుమారునికే ఇచ్చి చేసారు. అంటే మా తాత గారికి మేనల్లుడే అవుతాడు. మా చిన మేనత్త హైస్కూల్ లో చడువుతూవుండేది.
మా తాతయ్య గారి తండ్రి గారి పేరు గంగయ్య ,తల్లి గారి పేరు రాజమ్మ. అంటే మా ముత్తాత పేరు నాకు పెట్టారన్నమాట కాస్త దేశ భక్తీ కూడా కలిసివస్తుందని కాబోలు నాపేరుని ఆధునీకరించి బాలగంగాధర రావు అని మా తాత గారు పెట్టారు.. అయినా మా భందువులలో కొందరు నన్ను గంగయ్య అనే పిలిచేవారు ..
మా తండ్రిగారి పేరు వెంకట సుబ్బారావు ఆయనా తన మేనత్త కుతురయిన సుశీల వర్ధని ని
పెళ్లి జేసుకున్నారు.అంటే నా కన్నతల్లి పేరు సుశీల వర్ధని అన్న మాట. మా అమ్మ తండ్రి గారి పేరు
కోదండరామయ్య కొండపనేని. మా అమ్మమ్మ పేరు యశోద .. వాళ్లకి ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్దమే పేరు .,అంటే నాకు పెద్దమ్మ పేరు రాజ్యలక్ష్మి అంటే మా అమ్మమ్మ .,వాళ్ళ అమ్మ పేరు పెద్దకుమార్తె కు పెట్టుకున్న దన్నమాట.
మా అమ్మమ్మకి ఒక కొడుకు ,పేరు రంగారావు,అంటే నాకు మేనమామ అన్నమాట.
ఇక మా ముత్తాత గంగయ్యగారికి మాతాత నాగయ్య గారితో బాటు ముగ్గురు కూతుళ్ళు మొదటికూతురు పాపమ్మ ఆమెను గొరికపూడి.. లోనే ఇచ్చారు.వారి ఇంటి పేరు వేములపల్లి
రెండవ కుమార్తె దుర్గమ్మ ఆమెను కూడా గొరికపూడి లోనే ఇచ్చారు.వారి ఇంటి పేరు దేవినేని.
మా తాత గారు నాగయ్యగారు అప్పట్లోనే 8 వరకు చదువుకున్నారు. ఆయనకీ ఇంగ్లీషు రాయడము,చదవడ బాగా వచ్చు.కోర్ట్ వ్యవహారాలలో సలహా కోసరం చాలా మంది ఆయన దగ్గరికి వస్తుండేవారు.మాగ్రామా నికి  బ్రిటిష్ వారి కాలంలో పంచాయతి ప్రెసిడెంట్ గా చేసారుట.మా తండ్రి గారితోపాటు మాతాతగారికి మరొఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు కూడా వున్నారు. మా పెద్ద చిన్నాన్న వెంకట అప్పారావు.,రెండో చిన్నాయన పేరు వేంకటరత్నం. మా మేనత్తలలో పెద్ద మేనత్త పేరు వెంకట నరసమ్మ రెండో మేనత్త పేరు .,రాజ్యలక్ష్మిఅంటే మా తాతగారు చిన్న కూతురికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నారు.
రేపల్లె లో మేము అప్పుడున్న వీధి పేరు ,ఇప్పుడు మండవవారి వీధి గా పిలుస్తున్నారు.మావీదికి ఒకవైపున మాత్రమె వరుసగా ఇళ్ళున్నాయి .రెండోవైపు అంతా  పెద్ద మైదానం. వీధిలో వరుసలో మొదట రాతిగోడల రెల్లుగడ్డి ఇల్లు మా భందువులదే .ఆయన్ని యజ్ఞం అని పిలేచేవారు.రెండో ఇల్లు నాదెళ్ళ సూరయ్యగారు.ఆయన భార్య హనుమాయమ్మ గారు. మూడో ఇల్లు మాది . ఒక రెల్లుగడ్డి ఇల్లు, ఒక చావిడి ఉండేది.తర్వాత ఖాళీ ప్రదేశం .
తర్వాత జగదాంబగారి డాబా ఇల్లు  . వాళ్ళ ఆయన పేరు గుర్తులేదు. వరుసలో చివరి ఇల్లు రాతి గోడలమీద తాటాకు కప్పిన ఇల్లు పుల్లమ్మ గారిది. మా ప్రైవేట్ మాస్టర్ అందులోనే వుండేవారు. ఆయన పేరు నాగేంద్రం గారు.మా ఇళ్ళ ముందు మైదానం లో అవతలి ప్రక్కన పునాదులు వేసిన వేదికమీద ఒక పూరిల్లు .అది కొరటాల సత్యనారాయణ గారిది.ఆయన పెద్ద కమ్యునిస్ట్ నాయకుడు..ఏతా వాత
అప్పట్లో మా వీధిని అందరుకమ్యునిస్టుల బజారు అనేవాళ్ళు.కమ్యునిస్ట్ పార్టీ మీద నిషేధం ఉన్నకాలంలో మలబారు పోలీసులు మా బజారు మీద రెండు సార్లు దాడి చేసారు.ఒక సారి మానాన్నకోసం,ఇంకోసారి కొరటాల గారికోసరం. మానాన్న కూడా రేపల్లె తాలుక కమ్యునిస్ట్ పార్టీ శాఖకి ఒక భాధ్యుడి గా  వున్నారు అప్పట్లో.

మేము ఉండే ప్రాంతమంతా గరపనేల.యెంత వాన కురిసినా బురద కాలికి అంటదు.ఇక వర్షం కురిస్తే మా ఇంటిముందున్న మైదానం ఒక లోతు లేని చెరువు లాగా అయ్యేది.ఇకమాకు ఒకటే ఆటలు.ముఖ్యంగా
కాగితం పడవలు.అందులో ఎన్ని రకాలు కత్తి పడవ, రెక్కలపడవ,మళ్ళీ అందులో ఒక రెక్క వెనక్కి,
ఒకరెక్క ముందుకి.అబ్బో వర్షాకాలం మహా మజాగా ఉండేది.చిన్నతనం నుండి నాకు ఏదన్నా చదవడం,ఆటలాడడంఅంటే మహా ఇష్టం.ముఖ్యంగా ఆటల్లో గోళీలు ,బచ్చాలు,చెడుగుడు,మాది అంతాఇసుకనేల కాబట్టి  చెడుగుడు బాగా ఆడేవాళ్ళం. ఇందులో పాయింట్  రావడమేగాని అవుటయినోడు బయటికి పొయ్యే పని లేదు.తరవాత చావు బతుకులు .అంటేఅవుటయినోడు బయటికి పోవాలి .అంతే ఇప్పటి కబడ్డీ లాగా అన్నమాట .
బచ్చాలంటే నాకు టామ్సాయర్ గుర్తొస్తాడు.సిగరెట్ పెట్టెలు పోగు చెయ్యాలన్న మాట . ఒక్కో పెట్టెకి ఒక్కో విలువ.అన్నింటికంటే ఆ రోజుల్లో గోల్డ్ ఫ్లేక్ పెట్టె విలువ ఎక్కువ. అన్నింటికంటే తక్కువ చార్మినార్.
ఇందులో ఒక గోల్డ్  ఫ్లేక్ పెట్టెకి 10 చార్మినార్ ఓకులు అని మార్పిడి కూడా ఉండేది.

ఒక పెట్టె దొరికితే రెండు ఓకులు దొరికినట్లే. మాఇంటి దగ్గర పెద్దరోడ్డు మీద  బుడే సాయిబు కొట్టు అని  ఒకబడ్డీ కొట్టు వుండేది.నాకోసరం పాపం ఖాళీ సిగరెట్ పెట్టేలన్నీ దాచి  పెట్టేవాడు.మాబుడే సాయిబు కొట్లో గోల్డ్ ఫ్లేక్ దొరికేది కాదు .అవి ఖరీదు సిగరెట్లు.కాబట్టి రైల్ స్టేషన్ అవతల మెయిన్ రోడ్ మీదికి వెళ్ళి వెతకాల్సివచ్చేది.
నేను 6 వ తరగతినుండి,8 వ తరగతి వరకు  బోర్డ్ హైస్కూల్ లో చదువుకున్నాను.అప్పట్లో 6 వాతారగతిని ఫస్ట్ ఫాం అనేవాళ్ళు .తర్వాత సెకండ్ ఫాం ,థర్డ్ ఫాం ,ఫోర్త్ ఫాం, ఫిఫ్త్ ఫాం, చివరిది SSLC. చివరిది కాబట్టి స్కూల్ ఫైనల్ అని కూడా అనేవారు. అంటే 11 వ తరగతి అన్నమాట.అప్పట్లో అదే పెద్ద క్వాలిఫికేషన్ .
1951-52 విద్య సంవత్సరం లో ఫాస్ట్ ఫాం లో చేరాను..అప్పట్లో చివరి పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి పంపేవారు.నేను ఫాస్ట్ ఫాం తప్పాను .అందుకని మరల ఫాస్ట్ ఫాం చదివాను.నేను చదువుకున్నది జిల్లాబోర్డ్ హైస్కూల్ .రేపల్లె లో అది చాలా పెద్దది కొండరాతితో H ఆకారంలో కట్టారు.వెనకాల పెద్ద పెంకుటి చావిడి ఉండేది.

నేను ఫాస్ట్ పం లో ఉన్నాపుడే ప్రత్యెక ఆంద్ర రాష్ట్రం ఉద్యమం తీవ్రంగా జరిగింది.పొట్టి శ్రీరాములు గారు సుమారు 52రోజులు నిరాహార దీక్ష జేసి ప్రాణాలు కోల్పోయారు .ఆంద్ర రాష్ట్రం  తగలబడి  పోయింది. చివరికి కేంద్రం దిగొచ్చి అక్టోబర్ 2 నుండి ఆంద్ర రాష్ట్ర ఏర్పరిచారు. కర్నూలు రాజధాని.హైకోర్ట్ గుంటూరు లో ఏర్పాటు జేశారు. 

1952 లో దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పార్లమెంట్ కి రాష్ట్ర అసెంబ్లీ లకి జరిగాయి.
రేపల్లె నియోజకవర్గం నుండి మా పెదనాన్న అంటే మా నాన్నకు పెద్దమ్మ కుమారుడు మోటూరి హనుమంతరావు గారు పోటీ చేసి గెలిచారు.
ఆంద్ర రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు.1955 లో ఆంద్ర రాష్ట్రం లో శాసనసభకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి .కమ్యునిస్ట్ పార్టీ చిత్తూ చిత్తుగా ఓడిపోయింది.కాంగ్రెస్స్ పార్టీ అధికారం లోకి వచ్చింది బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
రేపల్లె జిల్లా బోర్డ్ హైస్కూల్ లో నేను నాలుగు సంవత్సరాలు అంటే థర్డ్ ఫాం వరకు చదివాను..మా స్కూల్లో 
బోడేపూడి వెంకట్రావు గారు సీనియర్ తెలుగు పండితుడు.మంచి కవి,పండితుడు అని పెద్ద వాళ్ళు చెప్పుకునేవారు.
మా చిన్న మేనత్త అప్పుడు అదే స్కూల్లో చదువుతూండేది.కవిత్వం కూడా రాసేది.ఆమెకి స్కూల్లో సన్మానం చేసి 'కవితాలక్ష్మి 'అని బిరుదు ఇచ్చి ఒక సరస్వతీదేవి బొమ్మ బంగారు పూతపూసింది ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు.ఇదంతా నేను సెకండ్ ఫారం చదివేప్పుడు జరిగింది.స్కూల్లో మా డ్రాయింగ్ మాస్టారు కొత్త కెమెరా కొని  మమ్మల్ని ఫోటో తీసారు.
మా ఇళ్ళ దగ్గరే దోనేపూడి సుబ్బయ్యగారని ఉండేవారు.అయన కొడుకులు ఇద్దరు ఒక్కసారే నాతొ పాటు ఫస్ట్ ఫారం లో చేరారు.పెదదోడి పేరు గంగాధరరావు.చిన్నోడి పేరు నాగేశ్వర రావు .దోనేపుదినుంది వచ్చి అక్కడ ఉంటున్నాడని ,ఆయన్ని దోనేపూడి సుబ్బయ్య గారని పిలిచేవారు.ఆయన ఇంటి పేరు వెనిగళ్ళ.ఆయన ఇంటి కెదురుగా రోడ్ కి ఇవతళ ప్రక్కన NGరంగా గారి బొమ్మ ఉండేది .ఆయనే అది పెట్టించాడు                                                 మా చిన్న మేనత్త పుణ్యమాని నాకు క్లాసు పుస్తకాలకంటే ఇతర పుస్తకాల చదవడం అలవాటయ్యింది.నేను ఆ రోజుల్లోనే విశ్వనాథ వారి వేయిపడగలు పుస్తకం చదివా .కదా గుర్తులేదుకాని కొన్ని పాత్రల పేర్లు గుర్తున్నాయి.ధర్మారావు ,పసికిరి ఇత్యాది.అప్పట్లో శరత్బాబు తెలుగు అనువాదనవాలలు తెగ చదివేవారు ఆంద్ర ఆడపడుచులు.
మాక్లాసులో బెతపుడినుండి  వచ్చ్చేవాళ్ళు ఎక్కువ .పూర్ణ చంద్రరావు గారు మా క్లాబ్ టీచరు.ఆయన కూడా బేతపూడి నుండి వచ్చేవాడు,
మాక్లాసులో ఆడపిల్లలు కూడా ఉండేవాళ్ళు.నాగమణి, సామ్రాజ్యం పేర్లు మాత్రం గుర్తున్నాయి.
 
ఇది నేను ఫాస్ట్ ఫారం లో మా డ్రాయింగ్ మాస్టారు తీసిన ఫోటో.నేను కలర్ లోకి మార్చా .
పైన నిలుచున్నవారిలో కుడినుండి రెండో వాడిని నేనే.

ఇది నేను థర్డ్ ఫారం వరకు చదువుకున్న స్కూల్ .అప్పటికి ఇప్పటికి మార్పు ఏమంటే రంగు వేసారు అంతె
నేను థర్డ్ ఫారం లోకి వచ్చేసరికి మా కుటుంబములో చాలా మార్పులు వచ్చాయి.
మా పెద్ద మేనత్త కాపురానికి వెళ్లి పోయింది .చిన్న మేనత్త బందరు హిందూ కాలేజ్లో డిగ్రీ లో చేరింది.
నేను మా చినమేనట్టా ఇంటర్ చదివేప్పుడు మొదటసారి బెజావాడ వెళ్లాను.మా నాయనమ్మఅక్కమనవాడు అక్కడ పోస్ట్ మాస్టారు .వాళ్ళింట్లో ౨యెల్లు ఉంది చదివింది ఇంటరు.అప్పుడే ప్రజాసక్తినగర్ లో ఉన్న మా పెదనాన్న ,అంటే మా నంకి పెద్దమ్మ కుమారుడు మోటూరు హనుమంతరావు గారింటికి కూడా వెళ్లాను వాళ్ళ ఇంటినుండి గుణదల కొండ కనబడుతుండేది.ఒక రోజు అది ఎక్కాలని వెళ్ళా .సగం ఎక్కాక భయం వేసింది.అక్కడనుండి దిగి వచ్చా.
మోటూరు హనుమంతరావు గారిది వెల్లటూరు .ఆయన కమ్యునిస్ట్ నాయకుడు.1952 జనరల్ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుండి కమ్యునిస్ట్ అభ్యర్ధిగా మద్రాసు శాసనసభకు ఎన్నికైనారు.పెద్ద అమ్మయి తాన్యా నాతొ పాటు రేపల్లెలో ఫస్ట్ ఫారం చదివింది.తర్వాత వాళ్ళంతా బెజావాడలో సెటిల్ అవడంతో బెజావాడ వెళ్ళిపోయింది.
బెజావాడ కో కొండలు నది నాకు అబ్బురంగా నచ్చాయి .
నేను థర్డ్ ఫారం చదివేటప్పుడు,మా నాగేశ్వర రావు బాబాయ్ తో కలిసి విశాఖపట్నం వెళ్ళా.బ్రహ్మాండంగా నచ్చింది.
ఇక్కడా మా నాగేశ్వరరావు బాబాయ్ గురించి చెప్పాలి.మోటూరు హనుమంతరావు గారు మా నాన్నకి పెద్దమ్మ కుమారుదయితే ,నాగేశ్వరరావు బాబాయ్ మా నాన్నకి పిన్ని కుమారుడు.నాకు ఊహ తెలిసినప్పటినుండి,ఆయన తనతల్లి బాపమ్మ గారితో,మా ఇంట్లోనే ఉండేవాడు.ఆయన తండ్రి ,ఈయన తల్లి గర్భం లో ఉండగానే గాలివానకి గొర్రెలను తోలుకేల్లి చనిపోయడుట.నేను ఫాస్ట్ ఫారం లో ఉండగానే ఆయన బిఎస్సీ,బిఎడ్ పూర్తి జేసి మా రేపల్లె బోర్డ్ హై స్కూల్ లో టీచర్ గచేరాడు.లెక్కల మాస్టారు ఎస్సేల్సి అంటే స్కూల్ ఫైనల్ కి లెక్కలు ,బౌతిక శాస్త్రము చెప్పేవాడు.


















Friday, July 8, 2011

పాలేరు బ్యాలెన్సింగ్ రిసర్వాయర్
ఖమ్మం జిల్లా .

Saturday, July 2, 2011



kusumanchi is also an ancient village like Nelakondapalli. here we can see an ancient Temple of Lord Siva built in the days of KAAKATEEYAS.

It was a feauture that Kaakateeyas built temples on high platforms. Here the height of the platform is nearly 9 feet . It gives a majestic look to the temple.

even the temple is very high and looks three storied.Sivalingam also is very large and looks majestic.

౨౬-౦౬-౨౦౧౧ ఆదివారం ఉదయం ౭ గం లకు ప్రేమ్చంద్ ని తీసుకుని కారులో బయలుదేరాను. ముందు జగ్గయ్యపేట లో
బౌద్ధస్తూపమ్ చూద్దామనుకున్నాను. కాని వూళ్ళో ఎవరిని అడిగినా అదేక్కడున్నదో చెప్పలేకపోయారు.ఆ వూళ్ళో కాఫీ త్రాగి మరల హైదరాబాద్ వెళ్ళే రోడ్డుకు వచ్చాము. అక్కడ ఒక గంట వృధా అయినది.అక్కడనుండి కోదాడ మీదుగా ఖమ్మం రోడ్డులో నేలకొండపల్లి చేరాము.
నేలకొండపల్లి వొక చారిత్రాత్మకమైన గ్రామము. భద్రాచల రామదాసు అనబడే కంచర్ల గోపన్న ఈ గ్రామమునకు చెందినవాడే. ఈ గ్రామములో చాల ప్రాచీనమైన వొక బౌద్ధ స్తూపము వున్నది. ఆ వూళ్ళో ఎవర్ని అడిగినా ఈ స్తూపం గురించి చెప్పలేకపోయారు. చివరికి వొక పెద్దమనిషి చెప్పాడు. ఆ స్తూపాన్ని ఎర్రదిబ్బ అని లేక విరాట రాజుదిబ్బ అంటారని చెప్పాడు.

Friday, January 7, 2011

అజంతా, ఎల్లోరా,పైథాన్ సందర్సన

౨౦ నవంబరు ౨౦౧౦ నుండి ౨౩నవంబరు ౨౦౧౦ వరకు నేను ,నా భార్య రాధాక్రిష్ణకుమారి కలిసి ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ ప్రయాణం చేయడము జరిగినది.

Tuesday, February 16, 2010


ఇది పడమటి రాతి కోట ద్వారము. పడమటి ద్వారము వెలుపల, మట్టికోట పడమటి ద్వారమునకు మధ్య ప్రజలు నివాసముంటున్నారు తూర్పు రాతి కోట లోపల బయట కూడా నివాసములు కలవు.
ఓరుగల్లు కాకతీయుల రాజధాని.ఇది తూర్పు ద్వారము.
కోట సుమారు ౧౯ కిలోమీటర్ల కైవారము కలిగివుంటుంది .
ముందు మట్టికోట తరువాత రాతికోట వుంటాయి. ఇది తూర్పు రాతికోట ప్రవేశ ద్వారము. ఈ ప్రవేశ ద్వారములు సరాసరి లోపలి ఉండక, మెలికలు తిరిగి వుంటాయి. తద్వారా శత్రువు సూటిగా లోనికి రాకుండా నిరోధించే వీలు వుంటుంది.కోటకు నాలుగు వైపులా ఈద్వారములున్నాయి . ప్రధానముగా తూర్పు ,పడమర ద్వారములు మాత్రమె నేడు కనిపిస్తున్నాయి.
మొవ్వ గ్రామము క్షేత్రయ్య జన్మించిన స్థలము .క్షేత్రయ్య ఈ గ్రామములోగల వేణు గోపాల స్వామి దేవాలయములో స్వామిని సేవించుచూ పదములను చెబుతువుండేవాడు.
ఈ ఆలయము చాలప్రాముఖ్యముగలది
ఈబౌద్ధ స్తూపము ౨౦౦౦ ఏళ్ళ పూర్వము నిర్మించబడింది . ఘంటసాల ఒకప్పుడు కంటకసాలగా పిలువబడేది. ఇది ఒక పెద్ద ఓడరేవుగా నదీతీరమున వుండేది. కాలక్రమమున నదికి యెడముగా జరిగినది. ఈ గ్రామములో పురాతన రోము నాణెములు లభ్యమైనవి.ఇది అత్యంత ప్రాచీనమైన గ్రామము .ఇప్పటికీ  ఈ గ్రామములో ఇళ్ళ నిర్మాణము          కొరకునేలనుతవ్వుతున్నప్పుడుపురాతన,ప్రాచీనఅవశేషాలుకనిపిస్తుంటాయి.

Monday, February 15, 2010

The Kuchipudi kalakhetram is managed by Sri Potti Sri Ramlu Telugu Viswavidyalayam in Kuchipudi village where the dance was born.
Me, my wife Radha and my daughter Ratnamala at Telugutalli statue in Kuhipudi kala khetra .
The Bullock cart a common sceen in the villages of costal Andhra.Unfortunately due to mechanisation they are gradually fading out of the country side I visited Ghantasala Krishna dt,on the day of Sivaratri on12-02-2010.There I got a chance of having this picture.

Saturday, February 13, 2010

I bgr mandava is 68. You may think at this age do I need this kind of activities. But I feel, I am unfortunate as I born in 1943 and missing the new technology in different walks of life. Any how my desire to learn something about new technology.Hence this Blog.

I am very mutch interested in ancient history of India and in particular the ancient history of Andhras i.e Telugu speaking people which represents phygiologically more or less the present Andhra Predesh. I am proud to be a Telgu man. I feel proud of  my ancient rulers SATAVAHANAS who conqured Magadha empire after Mouryas, I feel prod of the Ikshavakus, Vishnukundins Eastern Chalukyas ,Kakateeyas and finally Vijayanagar empire.

Our ancient poets such as Nannaya,Tikkana ,Yerrapraggada,Pothana,Srinadha,Palkuriki Somanatha,enriched our language with their poetry. One should remember Vemana Baddena and several Sathaka poets as they taught us how to be a good human.
In this modern age Sri Sri ,Cnary, Krishna sastry ,Malldi Rama Krishna Sastry,Veturi to be remembered forever.
I also proud of our Cenema industry.Vijaya, Annapurna, Vauhini,NAT, Bharani,gemini,AVM and such other banners produced very many good pictures.I am fortunate enough to be lived at the time the great actors and actress of ours such as NTR,ANR, CHIRANJEEVI,BHANUMATHI,SAVITHRI. Our melodious voices are GHANTASALA and BALU.
We have the great THYAGARAJA, the TELUGU VAGGEYAKARA who was the origin of karnatic music. Annmayya ,Khetrayya were also to be rembered.
By all this we are having a rich heritage in all aspects of human life and one should be proud of this and I am.