2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మే 23 న వెలువడ్డాయి .
ఊహించని ఫలితాలు వచ్చాయి.టీడీపీ - 23
జనసేన - 1
వైసీపీ - 151.
ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.టీడీపీ అంత హీనమయిన స్థితి లో ఉన్నాడని ఎవరూ అనుకోలేదు.
చంద్రబాబు పాలన పట్ల ప్రజలు అంత అసంతృప్తితో ఉన్నారని అనుకోడానికి ఆధారం లేదు.వోటింగ్ రోజున అర్ధరాత్రి వరకు ఉండి ఓటేసిన మహిళలు టీడీపీ వ్యతిరేకంగా వోటువేశారని అనుకోలేము.
ఈవీఎం లో మానిప్యులేషన్ ఉన్నదా అనే అనుమానం వస్తోంది.ఏది ఏమైనా 5ఏళ్ళు టీడీపీ పరిస్తతి ఆగామిగోచరం.
గతంలో పది ఏళ్లపాటు అధికారానికి ఎడంగా వున్నా చంద్రబాబు పార్టీ ని నిలబెట్టగలిగాడు.ఇప్పుడు ఆయనికి వయసు పెరిగింది. పార్టీని కాపాడుకోగలడా అనే విషయంలో సందేహాలున్నా వేచి చూడాలి.
జనసేనలో పొత్తు పెట్టుకున్నట్లయితే చంద్రబాబే మళ్ళీ అధికారంలోకి వచ్చివుండేవాడు.ఫలితాల సరళి అదే
చెబుతోంది.నాకు అర్ధం అయినది ఏమంటే పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ స్వంతంగా అధికారంలోకి రావడం.అసాధ్యం అని.
No comments:
Post a Comment