Friday, January 7, 2011
అజంతా, ఎల్లోరా,పైథాన్ సందర్సన
౨౦ నవంబరు ౨౦౧౦ నుండి ౨౩నవంబరు ౨౦౧౦ వరకు నేను ,నా భార్య రాధాక్రిష్ణకుమారి కలిసి ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ ప్రయాణం చేయడము జరిగినది.
Tuesday, February 16, 2010
ఓరుగల్లు కాకతీయుల రాజధాని.ఇది తూర్పు ద్వారము.కోట సుమారు ౧౯ కిలోమీటర్ల కైవారము కలిగివుంటుంది .
ముందు మట్టికోట తరువాత రాతికోట వుంటాయి. ఇది తూర్పు రాతికోట ప్రవేశ ద్వారము. ఈ ప్రవేశ ద్వారములు సరాసరి లోపలి ఉండక, మెలికలు తిరిగి వుంటాయి. తద్వారా శత్రువు సూటిగా లోనికి రాకుండా నిరోధించే వీలు వుంటుంది.కోటకు నాలుగు వైపులా ఈద్వారములున్నాయి . ప్రధానముగా తూర్పు ,పడమర ద్వారములు మాత్రమె నేడు కనిపిస్తున్నాయి.
ఈబౌద్ధ స్తూపము ౨౦౦౦ ఏళ్ళ పూర్వము నిర్మించబడింది . ఘంటసాల ఒకప్పుడు కంటకసాలగా పిలువబడేది. ఇది ఒక పెద్ద ఓడరేవుగా నదీతీరమున వుండేది. కాలక్రమమున నదికి యెడముగా జరిగినది. ఈ గ్రామములో పురాతన రోము నాణెములు లభ్యమైనవి.ఇది అత్యంత ప్రాచీనమైన గ్రామము .ఇప్పటికీ ఈ గ్రామములో ఇళ్ళ నిర్మాణము కొరకునేలనుతవ్వుతున్నప్పుడుపురాతన,ప్రాచీనఅవశేషాలుకనిపిస్తుంటాయి.
Subscribe to:
Posts (Atom)



