27-09-2020
పాత తెలుపు,నలుపు ఫోటో లు కలర్ లోకి మార్చాను.అవి కొన్ని పైన మొదట్లో ఉన్నాయి.
మార్చ్ 4 న బయలుదేరి కడప జిల్లా లో జమ్మలమడుగు దగ్గరగల గండికోట వెళ్ళాము .రాధ,రత్నమాల, రామక్రిష్ణ,నేను.
నిజంగా కోట ఇప్పటికీ చాలామటుకు చెక్కు చెదరకుండా ఉన్నది పెన్నా నది ఇక్కడ కొండల మధ్య ఎక్కడో లోతులో ప్రవహిస్తుంటుంది.దాన్ని గండి అంటారు .అందుచేత ఆ కోటను గండికోట అంటారు.పెమ్మసాని వారు ఈ రాజ్యాన్ని ౩౦౦ ఏళ్ళు పాలించారు.విజయనగరానికి సామంతులుగానూ,తర్వాత స్వతంత్రులుగానూ .చివరి రాజు పెమ్మసాని చిన తిమ్మా నాయుడుని,అతని మంత్రి విషం పెట్టి చంపి,కోటను ముసల్మాన్లకు అప్పగించాడు ట.అక్కడనుండి కమ్మవారు 76 ఇంటిపేర్లు కలవారు,తమ తమ ధనరాసులను గంపలకెత్తుకుని దక్షిణాదికి తరలిపోయ్యరుట .వీళ్ళని గండికోట కమ్మవారు,లేక గంపకమ్మవారు అని పిలుస్తారు.బుర్రిపాలెంలో నేను పనిచేసినప్పుడు,ఈ విశయం నాకు తెలీదు.బుర్రిపాలెంలో అంటా గండికోట కమ్మవారే.పెమ్మసాని,నర్రావుల,శాకమూరి,అడుసుమిల్లి,ఘట్టమనేని .ఊరంతా వీళ్ళే .
పెమ్మసాని రామలింగానాయకుడు,శ్రీకృష్ణ దేవరాయులు వద్దా ప్రధాన సైన్యాయధిపతి గా పని చేసాడు.గండిపేట లోని దేవాలయాలు,తాడిపత్రిలో గల దేవాలయాలు పెమ్మసానివారు నిర్మించినవే.వాటిలో శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది.